బలిజ వంశ పురాణం

Written by
Balija Vamsa Puranam

Balija Vamsa Puranam

17 వ శతాబ్దం ప్రారంభంలో కాశ్యప గోత్రోద్బవులు మధుర రాజ్యపు బలిజ నాయక రాజా వంశీయులగు శ్రీమాన్ మహారాజాదిరాజ రాజ శ్రీ విజయరంగ చొక్కనాధ నాయనయ్య వారు (1706-1732) శ్రీరంగంలో రంగనాధస్వామి దేవాలయంలో గొప్ప రాజకుల సభ నిర్వహించదలచి సమస్త విజయనగర కోట బలిజ రాజా బంధు జనాలకు తెలియపరచగా నాటి కులసభకు విచ్ఛేసిన చంద్రవంశ క్షత్రియ బలిజ బంధు వంశాలవారిని నాలుగు తరగతుల రాజబంధువులుగా వర్గీకరించడం జరిగెను.
ఆవిధంగా అక్కడికి వచ్చినవారి గురించి వారిచే ప్రకటింపబడిన చతుర్విధ రాజబంధు వర్గాల వివరాలు “శ్రీవంశప్రకాశిక” అను గ్రంథంలో పొందుపరచెను.
వీరందరూ నాయనివారు, శెట్టివారు, రౌతువారు (రాహుతవారు), రాజావారు, రావువారు (రాయలవారు), వజీరువారు అని ఆరు రకాల బిరుదులను తమ పేర్లచివర ధరించుచుంటారు.
వీరందరూకూడా మధుర, తంజావూరు, జింజి, కండి, జగదేవరాయ రాజ్యాలను ఏలిన బలిజ రాజవంశాలు, వారి బంధువులు, విజయనగర సామ్రాజ్య రాజా వంశాలు, రాజ బంధువులు.. ఒకటా, రెండా, పదా, ఇరవయ్యా మొత్తం 200 ఇండ్లపేర్లు గల “క్షత్రియ బలిజ” వంశాలవారు.
ఆనాలుగు వర్గాల వివరాలు మనకు క్రి.శ.1905లో కోయంబత్తూరుకు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త, సామాజికవేత్త, పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త అనేక సేవాకార్యక్రమాలలో తనకంటూ విశేషమైన పేరుప్రఖ్యాతులార్జించిన గౌరవనీయులైన శ్రీ సేలం పగడాల నరసింహాలు నాయుడు గారు వ్రాసి ముద్రించిన “బలిజ వంశ పురాణం”, బలిజ వారి పురాణం” గ్రంధాల ద్వారా అందుబాటులో వుంచినారు.
చదువరులకు అందుబాటులో ఉంటుందని ఇక్కడ పొందుపరుస్తున్నాను,
మీ జోగీనేని

Article Categories:
Balija · History

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.