Kapu JAC leaders meeting on September 11 to decide on quota issue

Written by

Kapu leaders meeting in Rajamahendravaram :september 11

సెప్టెంబర్ 11న రాజమండ్రిలో
కాపు జెఏసి అఖిల పక్ష సమావేశం…

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
—————————————
హైదరాబాద్ ,ఆగస్ 30,: ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ లు అమలు, ప్రభుత్వం పై ఒత్తిడి, భవిష్యత్ కార్యాచరణ పై హైదరాబాదు లో దాసరి నారాయణరావు నివాసంలో మంగళవారం జరిగిన కాపు నేతల ముఖ్య సమావేశం జరిగింది. ముద్రగడ పద్మనాభం , చిరంజీవి.బొత్స,అంబటి, పల్లంరాజు, కురసాల కన్నబాబు , తోట చంద్రశేఖర్, వాసిరెడ్డి , ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు , ఆరేటి ప్రకాష్ ఇతర ప్రముఖులు సమావేశానికి హాజరయ్యారు.
భవిష్యత్ లో ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించి నందుకు ముద్రగడ నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల నే తాము అడుగుతున్నాం.
హామి ఇవ్వక పోతే మేము రోడ్ల పైకి వచ్చే వాళ్ళం కాదని ముద్రగడ అనంతరం మీడియా తో అన్నారు.
ఈ ఉద్యమం లో మొదటి నుంచి పవన్ లేడని,
ఉద్యమము లో లేని వారిని నేను మద్దతు అడగనని మీడియా అడిగిన ప్రశ్నకు ముద్రగడ సమాధానం చెప్పారు. మా జాతి ఓట్ల తో చంద్రబాబు కుర్చీలో కూర్చున్నారని, అన్నీ వర్గాలను మోసం చేసినట్లే ,మమఁల్ని మోసం చేస్తున్నారని అన్నారు.
కాపు జాతి కోసం చేసే ఉద్యమ లో వెన్నకి వెళ్ళేది లేదన్నారు.రిజర్వేషన్ వచ్చే వరకు మేము నిద్రబోమూ,సీఎం ని నిద్ర పోనివ్వమని ,మేము దొంగలు,సంఘ విద్రోహులం కాదని అన్నారు.
ఉద్యమం లో పాల్గొన్న వారిని కేసు ల పేరు తో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు . వచ్చే నెల 11న రాజమండ్రిలో కాపు అఖిలపక్ష భేటీ అవుతామని, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామని ముద్రగడ అన్నారు .మా జాతి ఓట్లతో అధికారంలోకి వచ్చారు. అన్యాయం చేస్తే ఊరుకోం – నేను నక్సలైట్ ను కాదు… తీవ్రవాదిని కాదు – బెదిరిపోయి ఉద్యమం ఆపనని చెప్పారు. జగన్ వయసు నా రాజకీయ అనుభవమంత లేదు, ఆయన నా వెనుక లేరని అన్నారు. ముద్రగడ పద్మనాభం వెనుక ప్రతి కాపు ఉంటారని, ముద్రగడ ఒంటిరి కాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని, రాజకీయాలకు అతీతంగా కాపు ఉద్యమం కొనసాగుతుందని వైసీపీ నేత, అంబటి రాంబాబు అన్నారు. ముద్రగడ ఉద్యమానికి తామంతా మద్దతు గా నిలుస్తామని దాసరి నారాయణ రావు చెప్పారు.

kapu-leaders-meeting-in-hyderabad kapu-leaders-meeting-in-hyderabad kapu-leaders-meeting-in-hyderabad

kapu-leaders-meeting-in-hyderabad

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.