Kapu loan

Written by

Kapu loans.

కాపులకు రూ. 2 వేల కోట్ల రుణాలు..! పదో తేదీలోపు దరఖాస్తు చేసుకోండి..!!

ఈ ఏడాది కాపు కార్పొరేషన్ ద్వారా రూ.2 వేల కోట్లు రుణాలు ఇస్తున్నట్లు.. చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. రుణాల కోసం ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉందని..రుణాలు అవసరమైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ కాపుల సంక్షేమానికి ఏటా వెయ్యి కోట్లు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయిస్తే, అదనపు నిధులు, బ్యాంకు రుణాలు సమీకరించి కాపులకు ఈ ఏడాది మొత్తం రూ.2 వేల కోట్లు కాపు యువత కోసం కార్పొరేషన్ ఖర్చు చేస్తోంది. రుణాల కోసం దరఖాస్తు చేసుకునే కాపు యువత వయోపరిమితిని 18-45 నుంచి 21-50కి పెంచారు.

కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. విదేశాల్లో చదివే కాపు విద్యార్థులకు రూ.10 లక్షల స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు విద్యార్థులకు పోటీ పరీక్షలకు, ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి ఆర్థిక చేయూత ఇస్తామని తెలిపారు. ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లేందుకు రూ. 10 లక్షల వరకూ ఉపకారవేతనం చెల్లిస్తున్నారు.ప్రతి నియోజకవర్గంలో 15, 20 ఎకరాల్లో ఇండస్ట్రీ ఎస్టేట్ ఏర్పాటు చేసి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కాపులకు తగిన శిక్షణ కూడా కల్పించే ఏర్పాట్లు చేశారు. జిల్లాకో కాపు సంక్షేమ భవన్ నిర్మిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు కులస్తులను అదుకునేందుకు కాపు కార్పొరేషన్ ప‌ని చేస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గాలకు చెందిన యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నారు. అర్హులకు శిక్షణ ఇచ్చేందుకు పది కార్పొరేట్‌ సంస్థలను ఎంపిక చేశారు.

కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత కాపు యువతలో మరింత నమ్మకం పెరిగింది. మంత్రిగా కూడా గతంలో బాధ్యతలు నిర్వహించిన కొత్తపల్లి… తమ సామాజికవర్గ యువతను.. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తారని… కాపు యువత భావిస్తోంది. ఆ విషయంలో కొత్తపల్లి ఎవర్నీ నిరాశపరచడని భావిస్తున్నారు.

కాపు లోన్స్ కొరకు

మీరు ఎవరైతే లోన్ కొరకు పెట్టుకుంటారో వారు ముందుగా మీ క్యేస్ట్ సర్టిఫికేట్ నెగిటివిటీ సర్టిఫికేట్ ఆదార్ రేషన్ కార్డు కుదిరితే మీకు తెలిసిన బేంక్ ఉంటే ఆ బేంక్ నుండి విలింగ్ లెటర్ జత చేసి ఇ సేవా లో కాపు లోన్ కోరకు అప్లై చెయ్యాలి తరువాత మీకు మెసేజ్ వచ్చాక మీరు ఆన్లైన్ లో పెట్టిన కాకితాలతో మీ మండల mpdo ఆఫీసుకు పట్టుకుని వెళ్ళి అక్కడ ఇవ్వాలి తరువాత మీకు మెసేజ్ వస్తుంది కన్పామ్ మెసేజ్ వచ్చాక స్టేటస్ చూసుకుని ప్రొసీడింగ్ లెటర్ తీసుకుని అది పట్టుకుని మీ బేంక్ కి ఇవ్వాలి తరువాత మీకు మళ్ళీ మెసేజ్ వస్తుంది అప్పుడు ఇంకోసారి బేంక్ కి వెళ్లవలసి వస్తుంది లేదా అలా త్వరగా రాని పక్షంలో మళ్ళీ mpdo ఆఫీసుకు వెళ్ళి మీ స్టేటష్ చూపించి ఏ బేంక్ అయితే పడిందో వివరాలు తెలుసుకుని ఆ బేంక్ కి ప్రోసిడింగ్ పంపమని చెప్పి ఆ బేంకుకు మీరు ఒకసారి వెళ్ళాలి తరువాత మీ మరొకసారి మెసేజ్ అప్పుడు మీరు దేని నిమిత్తం అయితే పెట్టుకొన్నారో దాని యొక్క కొటేషన్ తీసుకుని బేంక్ కి ఇచ్చిన తరువాత అక్కడ వారు స్టెంపింగ్ కొరకు కొన్ని కాగితాలు ఇస్తారు వాటి మీద స్టాండింగ్ చేయించి బేంక్ వారికి ఇవ్వాలి ఒకటి రెండు రోజుల్లో మీకు ఫోన్ వస్తుంది అప్పుడు బేంక్ కి వెళ్ళాక వారు మూడు ప్రొసీడింగ్ లెటర్ ఇస్తారు అవి ఒకటి మీ కలక్టర్ ఆఫీసు వద్ద ఉన్న బీసి కార్పొరేషన్ నందు ఒకటి రెండు మీ MPDO ఆఫీసు వద్ద ఒకటి ఇవ్వాలి ఇవ్వని అయ్యాక మీకు సబ్సిడీ ఎమౌంటు ఒడుతుంది అప్పుడు మీ బేంక్ కి వెళ్ళి అక్కడ మరొ ఎకౌంటు తియ్యవలసి ఉంటుంది తరువాత మీ మీరు ఎవరి వద్ద అయితే కొటేషన్ తెచ్చుకున్నారో వారి పేరు మీద డిడి ఇవ్వడం జరుగుతుంది మీరు కొటేషన్ తెచ్చుకొన్నే ముందు మంచి వారి దగ్గర చూసి తెచ్చుకోండి ….

Article Tags:
Article Categories:
Kapu News

Comments

 • thanks

  satya THoTA May 4, 2018 7:36 am Reply
 • How I can apply for this?

  Vinod May 4, 2018 9:51 am Reply
 • Maaku chance unnada

  Sri ram ganta May 4, 2018 9:58 am Reply
 • manikanta

  Manikanta May 4, 2018 12:19 pm Reply
 • All the best.

  Sandeep May 4, 2018 4:14 pm Reply
 • తెలుగుదేశం కాపులకు లోన్ వస్తున్నాయి తప్ప నిజమైన అరుహులకు అందడం లేదు జన్మభూమి కమిటీలు……ఇంకా ఎందుకు ఈ కాపు లోన్స్….పచ్చ కాపుల లోన్స్

  Naresh May 4, 2018 4:29 pm Reply
 • Super sir but yela apply cheyali

  B.g.s.v.n.s.narasimha naidu May 5, 2018 5:48 am Reply

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.