Know Truths About Mega Star Chiranjeevi

Written by
Know Truths About Mega Star Chiranjeevi

పుట్టింటిలో పురుడు పోసుకుంటే పుట్టిన బిడ్డకు అమ్మమ్మ ఇల్లు సొంతమైపోతుందా?

YSR(Sakshi) and Chandrababu  media’s goebbels campaiging against Chiranjeevi.

ఈమధ్యన చిరంజీవి గురించి అబధ్ధాల ప్రచారం ఎక్కువయ్యింది…గతం లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎలా చేసేరో మళ్ళీ అలా…
చిరంజీవిదీ నాదీ ఇంచుమించుగా50ఏళ్ళ అనుబంధం…నా ప్రాణమిత్రునితోనే కాకుండా ఆ కుటుంబసభ్యులందరితోనూ నేను అనుబంధాలను పెంచుకున్నాను.ఆప్యాయతలను పంచుకున్నాను…చిరంజీవి తండ్రిగారు కొణిదల వెంకట్రావు గారు..చిరంజీవి కోసం గాంధీగారి జీవితచరిత్ర బుక్ కొన్నపుడు నాకోసం మరో కాపీ కొని నాకు ఇచ్చేవారు..బాప్ప ఇద్దరికోసం టిఫిన్,భోజనం అర్ధరాత్రి అయినా మాఇద్దరికోసం వుంచేది…ఆప్యాయతలు మాత్రమే తెలిసిన కల్మషం లేనిమనుషులు.. .
కొంతమంది స్వార్ధం కోసం చిరంజీవిమీద రకరకాలుగా అబధ్ధాలు,కేవలం అబధ్ధాలు మాత్రమే ప్రచారం చేసేరు..
నిజం చెప్పులు తొడుక్కునేలోపల అబధ్ధం ప్రపంచాన్నే చుట్టివచ్చేస్తుందనే నానుడి ఋజువయ్యింది

Know Truths About Mega Star Chiranjeevi Know Truths About Mega Star Chiranjeevi
R K Naidu గారు భార్య కాంతమ్మ గారితో నెల్లూరు నుండి మొగల్తూరు వచ్చి,రైస్ మిల్లు,వ్యవసాయం చేసుకుంటూ స్తిరపడ్డారు..ఆయనకు కాంతమ్మ గారివల్ల సంతానం కలగకపోవడం వల్ల రెండో వివాహం చేసుకున్నారు..పాలకొల్లు దొడ్డొపట్ల దగ్గరి ‘కుమ్మరిపాలెం’అనే గ్రామానికి చెందిన ‘కొణిదల’వారి ఆడబడుచు ‘రాధాబాయమ్మ’ ను…అయితే విచిత్రమైన విషయం రెండోపెళ్ళి చేసుకున్నాక మొదటిభార్యకు అయిదుగురు పిల్లలు కలిగేరు…రెండో భార్యకు పిల్లలు కలగలేదు..
అప్పుడు ఆర్కే నాఉడు గారు ఆలోచించి మొదటిభార్య పెద్దకూతురు ‘అంజనాదేవి’కి రెండవభార్య తమ్ముడు ‘కొణిదల వెంకట్రావు’లకు వివాహం చేసేరు..వారి ప్రధమ సంతానమే మన చిరంజీవి
మరి చిరంజీవి తండ్రిగారి వూరు కుమ్మరిపాలెం
మొగల్తూరు చిరంజీవి అమ్మమ్మగారి వూరు..
అందరిలాగే కొణిదల అంజనాదేవి కూడా మొదటి పురుడు పుట్టింట్లో మొగల్తూరులో పోసుకున్నారు..నర్సాపురం మిషనరీస్ ఆసుపత్రిలో22-08-1955న చిరంజీవి జన్మించాడు.
కొణిదల వెంకట్రావు గారి పెనుగొండ,ఒంగోలు,బాపట్ల,చీరాల,నెల్లూరు ఇలా చాలా వూళ్ళలో ఉద్యోగం చేసేరు..పిల్లవాడి చదువు సాగటంలేదని 7th classమొగల్తూరు లో చేర్పించడం వల్ల,వారింట్లో వుండే బేబీ టీచర్ శంకరబాబు[చిరంజీవి]ని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టి’నీ ఫ్రెండ్ని చెప్పడం..చిరంజీవి పిన్ని లు ఇద్దరూ మా అక్కల క్లాస్ మేట్స్,ఫ్రెండ్స్ కావడం వల్ల మేమిద్దరం ఒకే ప్రాణం గా మారిపోయాము
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇల్లు అందరూ చిరంజివిది అనుకునే ఇల్లు..నిజానికది చిరంజీవి మేనమామ జలకం శ్రీనివాసరావుది..అతను అప్పటికి మద్రాసులో వుండేవాడు..అక్కడ ఇల్లు కొనుక్కోడం కోసం మొగల్తూరులో తన తండ్రి నాయుడు గారిద్వారా వచ్చిన వారసత్వ ఆస్తిని అమ్మి,మద్రాసులో ఇల్లు కొనుక్కున్నాడు.
పుట్టింటిలో పురుడు పోసుకుంటే పుట్టిన బిడ్డకు అమ్మమ్మ ఇల్లు సొంతమైపోతుందా..అవ్వదు కదా,మరి ఈ అమ్మమ్మ,మేనమామల ఇల్లు చిరంజీవిది ఎలా అవుతుంది..తనది కాని ఇల్లుని చిరంజీవి ఎలా అమ్ముకున్నాడు???
ఇది గొబెల్స్ మానసపుత్రులు,స్వార్ధ రాజకీయులూ ప్రచారం చేసిన పచ్చి అబధ్ధం
చిరంజీవి మొగల్తూరులో 7th,10th class,Narsapuruలో Degree,ఒంగోలులో 6th,8th,9th,INTER చదివేడు..తండ్రిగారి ట్రాన్స్ ఫర్ లవల్ల చదువుకోసం అమ్మమ్మ ఇంట్లో వుండటం అనుబంధం ఎక్కువ మొగల్తూరు తో ముడి వేసుకుంది..మాది మొగల్తూరు అని చెప్పుకునేంత…మాది మొగల్తూరు అనగానే మేనమామ ఇల్లు,మొగల్తూరు లోని ఆస్తులు చిరంజీవికి చెందుతాయా????

Know Truths About Mega Star Chiranjeevi

Sources: Dr Satya Prasad( చిరంజీవి గారి బాల్య మిత్రుడు )

 

 

YSR(Sakshi) and Chandrababu(Yellow) media’s goebbels campaiging against Chiranjeevi.
One of the prime factors for PRP’s failure in 2009 elections was yellow media’s goebbels propaganda. Though Chiranjeevi entered the politics with Mr clean image and had given MLA tickets to 105+ BCs, media was succeeded in making people to believe in their goebbels campaiging against Chiranjeevi. Chiranjeevi failed to condemn gossips against his party as he had no own media house.

The same media has been succeeded in making their favourite political party winning in the elections.

” If corrupted politicians and yellow politicians are getting success through their own or pro media”

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.