Mudragada Padmanabham deadline 8-6-2016 : విజయమో.. వీరస్వర్గమో తేల్చుకుంటా

Written by
7 members arrest in tuni incident case

తూర్పుగోదావరి: తుని ఘటనలో కేసులుండవని చెప్పిన ప్రభుత్వం మాటతప్పి అరెస్టులకు పాల్పడుతోందని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపుల్లోని కులాలను విడదీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. మంజునాథ్ కమిటీ ఇప్పటివరకు పర్యటించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు.
అమాయక ప్రజలను జైల్లో పెడుతున్నారని.. కాపులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ముద్రగడ స్పష్టం చేశారు. రేపు సాయంత్రంలోగా కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేయకపోతే.. గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని ముద్రగడ ప్రకటించారు.
ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై దృష్టిపెట్టకుండా జాతిని ఇబ్బందులకు గురిచేస్తోందని, తుని ఘటనపై కేసులు ఉండవని చెప్పి అరెస్టుల పర్వం ప్రారంభించిందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. మంగళవారం రాత్రి కిర్లంపూడిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమాయకులను అరెస్టు చేశారని, కాపు జాతి సోదరులతోపాటు, ఇతర కులాల సోదరులను కూడా పోలీసులు అరెస్టు చేశారని, చాలా బాధగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని, కాపు సోదరులతో తనను విడదీసేందుకు.. తనపై కేసులు లేవంటున్నారని ఆయన అన్నారు.
బుధవారం సాయంత్రంలోగా కేసులు ఎత్తివేయాలని, సానుకూల ప్రకటన రావలని.. అలా జరగని పక్షంలో 9వ తేదీ నుంచి నిరాహారదీక్షకు దిగుతానని ముద్రగడ హెచ్చరించారు. విజయమో.. వీరస్వర్గమో తేల్చుకుంటానని అన్నారు. కాపులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని, కాపుల కోసం దేనికైనా సిద్ధపడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై ఎన్నో కేసులు పెట్టారని, అన్ని కేసులు ఉపసంహరించుకోవాలని ముద్రగడ డిమాండ్ చేశారు.

7 members arrest in tuni incident case 2 7 members arrest in tuni incident case 7 members arrest in tuni incident case

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.