Why tails at the end of your name like Chowdary, Reddy?

Written by
Guntur city kapus protest to Support the Mudragada Padmanabham’s Hunger strike

Why tails at the end of your name like Chowdary, Reddy?

అవును మాకు కుల పిచ్చే, కుల గజ్జే….social media మొత్తం కాపులకు కుల పిచ్చి అని అరుస్తున్న నా సోదరులకు, సోదరిమణు లకు ….

1) మా మీద Comments and shares చేసే ప్రతి వారి పేరు చివర “తోక ” ఎందుకు ఉన్నట్టు ? మీకు ఏ ‘గజ్జి’ లేకపోతె ఆ పేరు చివరన ఉన్న “తోక” ను atleast Facebook page లో నుంచి ఎందుకు తీయలేకపోతున్నారు ?

2)అవును మాకు కుల పిచ్చే ? కాని ఎందుకు మా కులం మాకు గుర్తుకు వచ్చింది ? పరీక్షల్లో ఎంతో కష్టపడి 85-95% మార్క్స్ వస్తే నువ్వు qualify కావు రా, జాబు రాదు (బాబు వచ్చిన కానీ) మనది OC category అని పెద్దలు చెప్తే….అంటే ఏంటి అని అడిగితె ….అప్పుడు చెప్పారు …మన కులం ఇది రా? ఈ కులం లో పుడితే 100కి 98- 99% రావాలి …ఆ కులం లో పుడితే 70-80% వచ్చిన చాలు అని ?

అప్పుడు తెలిసింది మాది ఈ ‘కాపు ’ కులము అని …..ఈ కామెంట్స్ చేసే పేరు లో “తోక” పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇదే సమస్య….కాకపోతే వాళ్ళకి పోరాడే ధైర్యం లేదు, ప్రశ్నించే అవసరము లేదు ….ఎందుకంటే రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు మనోల్లె ఉంటారు కద రా అని ….అది మాత్రం అభిమానమే ….కుల గజ్జి అస్సలే కాదు

3)మీము బంగ్లా లలో , కారుల్లో తిరిగే వాళ్ళకు రిజర్వేషన్స్ అడుగుతున్నామ ? మీరందరూ రొజూ post lu మీద పోస్ట్ లు , share లు చేసే “Economically Backward people” కె కదా రావాలని అడుగుతున్నాం …

4)అందరు కలిసి, మోత్హం రిజర్వేషన్స్ తీసేసి ఆర్దికంగా వెనక పడినవాల్లకే ఇవ్వాలని పోరాడే ప్రశక్తే లేదు ….ఎందుకంటే మన అందరికి కుల గజ్జి కదా , పక్కోడి తో కలవం …..పోనీ ఎవడికి వాడు పోరాడతాం అంటే “మాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు ” అంటారు….ఇది ఏమి గజ్జో….

5) మాకు కుల పిచ్చే ఉంటె , మా కులపోడికె ఓట్లు వేసేవాళ్ళం కదా ?…..రాష్ట్రము అభివృద్ధి కంటే మా కుల పిచ్చే ఎక్కువ ఉండాలి కదా మరి?, పోనీ , మా వోట్లు లేకుండా గెలిచామని ఎవరైనా చెప్పగలరా?

6) మీరు అన్నట్లు మాకు కుల పిచ్చే ఉంటె మా కులపోడే CM కావాలని అత్యదికం ఉండే మీమే ఓట్లు వేసుకోవాలి కదా ? లేక మా కులపోడు వేసిన భిక్ష రా మీకు ఈ అధికారం అని మీ నోర్లు మూయించాలి కదా ? అలా జరగట్లేదే మరి?

7) ఇంక రైలు దుర్ఘటన బాదాకరం ….ఉద్యమం లో కొన్ని సార్లు అనుకోనివి జరుగుతాయ్….వాళ్ళని కటినంగా శిక్షించాల్సిందే, ఇప్పుడు అందరూ గొంతు చించుకుని ఈ విషయంపై మాట్లాడుతున్నారు కదా…మరి మా ప్రాంతం లో జరిగిన పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి మాకల్లెదుటే 27 మంది చనిపోతే enquiry ఏది? report ఏది? అక్కడ ఏమి జరిగిందో అందరికి తెలుసు….ఇప్పుడు గొంతు చించుకున్న వాళ్ళందరూ అప్పుడు కూడా చించుకుంటే, మా ప్రాంత ప్రజల ప్రాణాలు కుడా ప్రాణాలే అని గుర్తించేవాళ్ళం ….ఏమైనా అంటే డబ్బు ఇచ్చారు కదా ప్రభుత్వం వారు అంటారు…..ప్రాణం విలువ పైసలతో …..

8) లేని పోని వాదాలతో , కులం కులం అని “పాత” రోజులు మళ్లీ వచ్చేలా చేయొద్దు ….అందరిది ఒకటే కులం “ఆకలేస్తే అడుక్కునైనా తినే కులం ”, కేవలం కులం వల్లే మీము వెనకపడుతున్నాం కాబట్టి ఆ కులానికే రిజర్వేషన్స్ అడుగుతున్నాం , మీకు ఈ సమస్య ఉంది అని తెలుసు ….వీలయితే కలిసి పోరాడదాం , మీము ఏ కులన్నీ తక్కువ చెయ్యట్లేదు, అసలు కులం పేరే ఎత్తట్లేదు ….మాకు కావాల్సింది మా కులం లో పుట్టి బతకడానికి డబ్బులేక , చదివే స్తోమత లేని , చదివే తెలివి ఉన్న నిరుపేద కాపులకు reservation పేరుతో న్యాయం చేయమంటున్నాం …

ఇంక నాయకులూ అంటారా ? Elections వస్తే వాగ్దానాలు , అయిపోయాక committee లు వేసి ఎన్నాళ్ళు గడుపుతారో చూస్తాం ….మా కోసం పోరాడే వాడు రాజకీయం కోసం పోరాడుతున్నాడు అని అన్నా…, ఫలితం వస్తుందంటే అస్సలు ఆలోచించం ….మా లో ఐక్యత లేదు అని ఇన్నాళ్ళు ఏడ్చాం …..ఈ రోజు కలిసాం, కేవలం సాదించుకోటానికే… పోరాడడానికి సిద్ధం ….సాదిన్చుకుంటాం …..
మీ
నాగ సుధా కొండ

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.