అలంపూర్ బలిజవారి దాన శాసనం – క్రీస్తుశకం 1299-Balija Caste

అలంపూర్ బలిజవారి దాన శాసనం – క్రీస్తుశకం 1299

శాలివాహన శక సంవత్సరం 1221 (క్రీస్తుశకం 1299). అప్పుడు కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజు ఓరుగల్లు కేంద్రంగా పరిపాలిస్తున్నారు.

అప్పుడు వీర బలిజ సమయ ధర్మ పరిపాలకులైన పృద్విశెట్టి అలంపురి ముమ్మడి బ్రాహ్మిశెట్టిగారు, (పృధ్విశెట్టి అంటే ఆ కాలంలో రాజ్య పరిపాలన సరిహద్దులతో నిమిత్తం లేకుండా అన్నిప్రాంతాల వ్యాపార వర్గాలన్నింటికీ పెద్ద)
మరియు
వాడి బ్రహ్మిశెట్టి,
నాడనాలుక సిరియాళ శెట్టి,
బడవరచెలి దేవిశెట్టి,
మిండగుద్దలి అనిశెట్టి,
పట్టణస్వామి రవలిశెట్టి,
చలవాది నామిశెట్టి,
పిండి బాశెట్టి,
చలవాది కేశెట్టి,
చలవాది నారెప జోగిశెట్టి,
కంచె మారిశెట్టి కొడుకు ఎర్రమాచెనశెట్టి,
పాకనాటి ప్రోలిశెట్టి,
నల్లా గెసెట్టి,
ఓలే బాశెట్టి,
లక్కిశెట్టి లక్కయ్య,
శిఖరద దేవిశెట్టి,
మంచెమశెట్టి,
లోకిశెట్టి,
వచ్చెనాయని నాగిశెట్టి,
కోడూరి హెగర గెసెట్టి ,
దేవక నాగిశెట్టి,
వట్టెం మాచెనశెట్టి
వంటి అలంపురం స్థలంలో ఉన్న సమస్త బలిజ వ్యాపార ప్రముఖులూ, అలంపురం బ్రహ్మశ్వర స్వామి వారి మహా స్థానాధిపతులుగా ఉన్న పెదమలం మలదేవరాజు వంటి వారితో కలిసి, బ్రహ్మెశ్వర స్వామివారి తపోధనులు పద్మజియ్య కొడుకులు మదజియ్య, నాగజియ్య గార్ల కాళ్ళు కడిగి చేసిన భూదానాలను గురించి ఈ శాసనంలో వివరించారు.

అలంపురం అనేది పురాతనకాలంగా గొప్ప శైవ క్షేత్రం, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, తరతరాల బలిజవారికి గొప్ప వ్యాపార కేంద్రాలలో ఒకటి, అలంపురం కేంద్రంగా ఉన్న ప్రాంతం అలంపుర స్థలం, అది అప్పటికి కాకతీయ మహాసామ్రాజ్యంలో భాగంగా ఉండేది.

సాధారణంగా అప్పటికి బలిజలు చాలామట్టుకు వీరశైవులని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి, వ్యాపార సామజిక వర్గం. అప్పటి కాలంలో బలిజవారికి పేరుచివర కచ్చితంగా శెట్టి అనేది ఉంటుంది. ఈ శాసనంలో పేర్కొనబడిన వ్యక్తుల ఇండ్లపేర్లు ఇప్పటికి బలిజవారిలో ఉన్నాయి.

వ్యాపార సామజిక వర్గంవారైన బలిజవారు ప్రముఖ శైవ దేవాలయాలలో చేసిన దానాలకు సంబందించిన శాసనాలు అనేకం వీరి ప్రఖ్యాతిని తెెలియజెబుతున్నాయి.

బలిజవారు తొలుత నేటి ఉత్తరప్రదేశ్ లోని ప్రాచీన మహానగరం అహిచ్ఛత్రపురం నుండి కర్ణాటకలోని అయ్యావళి వచ్చిన ఆర్యులు అని తమ శాసనాలలో తమ మూలలను పేర్కొన్నారు. వీరు కర్ణాటక లోని ప్రస్తుతం ఐహోల్ అంటున్న అయ్యావలి పట్టణం కేంద్రంగా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, శ్రీలంక వంటి అన్నిప్రాంతాలకు విస్తరించారు.

((ఫోటో – ఈ శాసనాన్ని పరిశీలించిన శ్రీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమారుగారు ))

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *