కుల గజ్జి లక్షణాలు

Written by
Caste scabies symptoms

Caste scabies symptoms – కుల గజ్జి లక్షణాలు

కొంతమంది దేశభక్తులు తమ తమ కులాలని గంగలో కలిపేసినట్లు నటిస్తూ ఎదుటివారిని నీతులు చెబుతూ తెరవెనుక బాగోతాలు నడుపుతున్నారు వారిని చూస్తుంటే ఒక రచయిత చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి అవి “ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అవి మాకు వర్తించవన్నాయి” అన్నట్లు ఉంది.

అయినా ఒక్కటి నా కులం ఫలానా అని చెప్పుకోవడం తప్పు కాదు ఎదుటువాని కులాన్ని గౌరవించకపోవడం తప్పు.

ఇంతకి అసలు సిసిలైన కుల గజ్జి అంటే ఏమిటి అసలు అవి ఆవహించిన వారి బావబావాలు ఎలా ఉంటాయి అంటే నేను ఎంతో మందిని పరిక్షించిన తరువాత ఈ పోస్టు పెడుతున్నాను ఇవి మీకు నచ్చాలి అని లేదు, అందరూ ఆమోదించద్దగినవే ఎందుకంటే ఇవి ప్రతి వ్యక్తికీ ఉండవు మరియు ప్రతి కులానికీ ఉండవు కేవలం కుల గజ్జి వారికి మాత్రమే అందులో

1) ఏ కులానికైతే రాజాధికారం ఎక్కువ రోజులు ఉంటుందో ఆ కులం వారికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

2) ఏ కులవారు అయితే ఇతర కులాల వారిని బానిసలలా చుస్తారో వారికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

3) ఏ కులం వారు అయితే అణగారిన బడుగు, బలహీన వర్గాలను తమ ఆదీనంలో పెట్టుకుంటారో వారికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

4) ఏ శాఖలో అయితే ఎక్కువ మంది ఒకే కులం వారు ఉంటారో వాటిని నడిపించే నాయకుడికి కుల గజ్జి ఉంటే అక్కడ పని చేసే అదే కులం వారికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

5) ఏ కులం వారు అయితే అన్ని శాఖలని తమ ఆదీనంలో పెట్టుకుంటుందో వారికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

6) ఎవ్వడైతే నాకు కులం లేదు నేను హిందువుని అని నలుగురిలో ప్రగల్బాలు పోతాడో వాడికే నిజంగా ఎక్కువ కుల గజ్జి ఉంటుంది ఎందుకంటే కులం అనేది తప్పు కాదు అది లేకుండానే వాడు పుట్టలేదు మీరు వాడి మాటలని కాకుండా వాడి పనులని గమనిస్తే మీకే అర్దం అవుతుంది ఇది.

7) ఎవ్వరు అయితే కాలేజీలో చేరి కేవలం తమ కులం వారితో తిరుగుతూ పక్క కులం వారి దగ్గర నీతులు చెబుతారో వారికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

8) ఏ తండ్రి అయితే ఇది మనవాళ్ళ స్కూలు, కాలేజి అని బాల్యం నుంచి వారికి రుద్దుతారో వారికి ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

9) ఏ కులానికైతే కాలేజిలలో యాజమాన్యం వర్తాసు పలుకుతుందో ఆ కాలేజీలో చదివిన ఆ కులం వారికి ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

10) ఏ కులం వారి ఇంట్లో తప్పులు చేసినా పైకి ఉన్నతంగా తిరుగుతారో వారికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

11) ఏ కులం వాడి ఇంట్లో మగవాడి ఆటలు సాగవో వారికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

12) ఏ రాజకీయ నాయకుడు అయితే విబజించు పాలించు సిద్దంతాలతో ప్రజల మధ్యన చిచ్చు పెడతాడో వారి కులానికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

13) ఏ కులం వారికైతే ఎక్కువ బినామీలు ఉంటారో వారికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

14) ఏ కులం వారు అయితే అసలు కులాలు లేవు ఏమి లేవు అని బయటకి నటీస్తారో వారికే ఎక్కువ కుల గజ్జి ఉంటుంది.

ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చెప్పాలి అంటే లిస్ట్ సరిపోదు మరో పోస్ట్లో మళ్ళి చెబుతా ఇవి మీకు నచ్చితే షేర్ చెయండి కులగజ్జి వారిని బహిస్కరించండి

సోర్సు: తుమ్మల రామయ్య

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.