jana Sena public meeting at Tirupati tomorrow

Written by
jana Sena public meeting at Tirupati tomorrow

jana Sena public meeting at Tirupati tomorrow :

రేపు తిరుపతిలో భారీ బహిరంగ సభ

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సమయాన్ని పూర్తిగా లేదా ఎక్కువగా రాజకీయాలకు కేటాయించనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం తిరుపతిలో జనసేన ప్రస్థానం పేరిట బహిరంగ సభ జరగనుంది.జనసేన సభ కోసం పవన్ కళ్యాణ్ కోటరీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఆయన రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల పైన స్పందించే అవకాశముందని తెలుస్తోంది. హఠాత్తుగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. ఇది చర్చనీయంగా మారింది.

శనివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం తిరుపతిలోని ఇందిరా మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారనేది ఆ వార్త సారాంశం. ఇప్పుడు ఈ సభే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఈ సభ నిర్వహణకు సంబందించి గాసిప్స్ వస్తున్న సమయంలో జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య కొన్ని విషయాలు తెలిపారు. పవన్  కల్యాణ్ సభ నిర్వహణ వాస్తవమేనని – దాని కోసం ఇప్పటికే నగర పాలక సంస్థ – పోలీసుల అనుమతి కోరామని తెలిపారు. దీంతో సభ నిర్వహణ పక్కా అని తెలిసిపోయింది. ఇక.. ఈ సభలో పవన్ ఏమి మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు అందరి మనసులనూ తొలిల్చేస్తున్న ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు పవన్ మాట్లాడటానికి ఉన్న విషయాలన్నీ హాట్ టాపిక్స్ మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ పెను సంచలనాలు తీసుకువచ్చేవిగా ప్రజలు భావించడమే.

కర్ణాటకలో ఇటీవల హత్యకు గురైన తన అభిమాని వినోద్ కు సంతాపం తెలిపన అనంతరం పవన్ మాట్లాడబోయే ప్రతిమాటా ఒక సంచలనం కాబోతుందనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ప్రస్తుతం పవన్ మాట్లాడటానికి అతి ముఖ్యమైన సబ్జెక్ట్ గా ఉన్నవాటిలో “ప్రత్యేక హోదా”ది ప్రధమస్థానమనే చెప్పాలి. ఏపీలో రాజకీయాలు వేడెక్కడానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా. ఈ విషయంపై ఇప్పటికే కేవీపీ రూపంలో కాంగ్రెస్ – ప్రతిపక్ష పార్టీగా వైకాపా తమవంతు పాత్రను నడుపుతున్నాయి.

అయితే ఈ విషయంలో టీడీపీ – రాష్ట్ర బీజేపీ నేతల వైఖరిపైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో మీడియా ముందుకువచ్చి కానీ – ట్విట్టర్ ద్వారా కానీ పూర్తిగా స్పందించని పవన్ ఉన్నట్లుండి ఒక సభ పెట్టడం మామూలు విషయం కాదు. ప్రత్యేక హోదా విషయమా.. బీజేపీ – టీడీపీ ల మధ్య జరుగుతున్న సంబంధమా.. టీడీపీ – బీజేపీలతో పవన్ కున్న దోస్తీ వ్యవహారమా.. లేక జనసేన పార్టీ కార్యక్రమాల ప్రస్థావనా.. వీటిలో పవన్ ఏ విషయంపై ప్రసంగించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సంచలనమే అవుతుంది.

పవన్ కళ్యాణ్ సభకు అనుమతి కోరిన జనసేన

శనివారం నాడు నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ సభకు జనసేన తిరుపతి నగర పాలక సంస్థ అనుమతి కోరింది. రేపు మధ్యాహ్నం తిరుపతిలో పవన్ బహిరంగ సభ నిర్వహిస్తారని పార్టీ కోశాధికారి రాఘవయ్య చెప్పారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు పవన్ దిశానిర్దేశనం చేస్తారన్నారు. అజెండాపై వివరాలు వెల్లడిస్తామన్నారు.

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.