Johar Kunisetty Venkata Narayana Dora

Written by

మట్టిలో మాణిక్యం లాంటి మన జాతి రత్నం శ్రీ కూనిశెట్టి వెంకటనారాయణదొర గారి గురించి తెల్సుకుందాం!

బ్రిటీషువాడి కర్కశకోరలలో చిక్కుకున్న సువిశాల భారతావని స్వతంత్రం కోసం చేస్తున్న మహోద్యమంలో భాగంగా, శాంతి మరియు సాయుధ మార్గాలలో ఆసేతుహిమాచలంలోని స్వతంత్ర సమరయోధులందరూ ఏకస్ఫూర్తితో ఉద్యమిస్తున్న వేళ…

ఆనాటి విశాఖపట్నం జిల్లాలో ఉన్న సాలూరులో ఒక యువయోధుడు స్ధానిక MRO ఆఫీసు జంక్షన్ వద్ద జరిపిన శాంతియుత పోరాటానికి, అతడు చూపిన సహనానికి, ఆంగ్లేయులే ఆశ్చర్యపోయిన సంఘటన ఒక్కసారి స్మరించుకుందాం.

వందేమాతరనినాదం చేస్తే చాలు, విచక్షణారహితంగా లాఠీదెబ్బలు సంధిస్తున్న బ్రిటిషువాడి అహంకారానికి ఎదురెళ్లి, “వందేమాతరం”… అంటూ ఒక యువకుడు గొంతు అలిసిపోయేలా, దిక్కులు పిక్కటిల్లేలా పదేపదే హెచ్చుస్వరంతో చేసిన నినాదాలు స్ధానికులందరికీ గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయి. ఆస్ఫూర్తి జ్వాల అందరిలో రగిలి, ఇక సాలూరులో బ్రిటిషువాడిపై భయాన్ని తగలబెడుతుందేమోనని ఆందోళన చెందిన ఆంగ్లేయులు ఆ యువకుడిని తమ కర్కశ లాఠీపోట్లతో చిత్రవధ చేసారు. ఒళ్లంతా దెబ్బలతో అలసిపోయినా, నీరసించిన స్వరం మందగించినా, అతడు వందేమాతరనినాదాన్ని ఆపకపోవడం అందరినీ కదిలించింది. ఆంగ్లేయులను సైతం ఆశ్చర్యపరిచింది. మరికొన్ని దెబ్బలు కొడితే చచ్చిపోతాడేమోనని గ్రహించిన బ్రిటిష్ వారు, ఆ యువకుడిని బరంపురం సి-క్లాసు జైలుకు తరలించి కఠిన జైలుశిక్ష విధించారు. తన మాతృదేశపు బానిస సంకెళ్లని ఛేదించేందుకు చేస్తున్న పోరాటంలో భాగంగా సంభవించిన చీకటి కొట్టు సింగిల్ లాకప్ జైలు జీవితాన్ని ఒక ఏడాదిన్నర పాటు సంకెళ్లమాటునే సంతృప్తిగా భరించాడు ఆ యువకుడు.
ఆ తరువాత ఎన్నెన్నో పోరాటాల తరువాత,
కొన్నేళ్ల తరువాత భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 ఆగష్టు 15న,
ప్రజలంతా తమ ఆరాధ్యనేతగా భావించిన ఆ యువకుడిని సాలూరు ఊరంతా గుర్రంపై ఊరేగించారు.

తమ ప్రియమైన నాయకుడిని “సాలూరు గాంధీ” అని ప్రేమగా పిలుచుకున్నారు.

అతడు తన స్వీయ హస్తాలతో సాలూరు లో తొలి స్వాతంత్ర్య జెండా ఎగురవేసాడు.

ఆతడెవరోకాదు!

అపర దేశభక్తి పారాయణుడు

ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు

సర్దార్ శ్రీ కూనిశెట్టి వెంకటనారాయణదొర.

తదనంతరం 1952లో దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా, సాలూరు నియోజకవర్గానికి తొలి శాసనసభ్యునిగా అఖండమెజారిటీతో విజయం సాధించారు.

ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు-తమిళ ఎమ్మెల్యేల మిశ్రమంలో మన దొర, స్ఫురద్రూపంతో మెరిసారు.

ఒంటినిండా బట్టకట్టడమెలాగో తెలియని తన అమాయక గిరిజనం కోసం,
కాయకష్టం చేసి బ్రతికే తన అభిమాన బడుగు బలహీన వర్గాల కోసం,
సాయంకోసం ఎదురుచూసే నిస్సహాయ సామాన్య, మధ్యతరగతి ప్రజలకోసం,
రెండు పంటలూ సమృద్ధిగా పండించాలని పరితపించే రైతాంగం కోసం,
సద్గురువులతోనిండిన ప్రభుత్వోన్నతపాఠశాల కళ కొరకు కలల కంటున్న విద్యార్థులకోసం,

సాలూరు నియోజకవర్గ ప్రజలందరి కోసం,

కారణజన్ముడిలా,
కన్నీళ్ళు తుడిచే అన్నలా,
కష్టం తీర్చే తండ్రిలా,
అవతరించిన అఖండ ప్రజాదరణ కలిగిన నాయకుడు
మన వెంకటనారాయణదొర.

అతడికి స్వార్ధం తెలియదు.
గ్రూపులు కట్టడం రాదు.
ప్రజాహితంకోసం ఉన్న ఆస్తులు కోల్పోవడం తప్ప,
తరాలు తిన్నా తరగని సిరులు గడించడం చేతకాదు.
అతని జన్మస్థలం సాలూరుకి సాగునీరు, త్రాగునీరు, విద్య, విద్యుత్, వైద్యం, బొబ్బిలి-సాలూరు మధ్య ట్రైను మార్గం ఇలా ఎన్నో, ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

విశాఖలో హైకోర్టు,

విశాఖలో అసెంబ్లీ సైతం ప్రతిపాదించిన ఘనత శ్రీ దొరగారిదే!

మన భారత రాష్ట్రపతి కూడా చేసిన శ్రీ వి.వి.గిరి గారిని ఎం.పి.గా గెలిపించిన ఘనత కూడా శ్రీ కూనిశెట్టి దే!

ఇతను మనవాడవ్వడం మన జాతి అదృష్టం!

జోహార్ వెంకటనారాయణ దొరా! జోహార్!!!

by
Lokesh Kunisetti

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.