Kapu Leaders Meeting in Hyderabad

Written by
Kapu leaders Dasari Narayana Rao, K.Chiranjeevi, Botcha Satyanarayana and M.M. Pallam Raju at a meeting in Hyderabad on Monday

Kapu Leaders Meeting in Hyderabad

We support Mudragada Padmanabham : Mega Star Chiranjeevi

Mega Star warns Andhra Pradesh Government

13-06-2016: కాపు రిజర్వేషన్ల అంశంపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి ఏమైనా అయితే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ నాయకుడు, సినీనటుడు చిరంజీవి హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం జాప్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం, ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన కాపు ప్రముఖులు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత చిరంజీవి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలపై ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని, లేదంటే రెండు రోజుల తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ముద్రగడ కుటుంబసభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

గత పది రోజులుగా ఏపీలో చాలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని, ఇది చాలా అప్రజాస్వామికమని చిరంజీవి అన్నారు. ముద్రగడ పద్మనాభం దీక్ష ప్రారంభించిన రెండు గంటల్లోపే తలుపులు పగలగొట్టి, ఆయనను నిర్బంధించి అయోమయ పరిస్థితి కల్పించారని, ఆయన కోడలు, భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. దీన్ని తామంతా కలిసికట్టుగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. ఆయన అడగకూడనిది ఏమీ అడగలేదని, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినవి, ఎన్నికల కమిషన్‌కు సమర్పించినవే అడిగారని గుర్తు చేశారు. తుని ఘటనను తామెవరూ సమర్థించబోమని, అయితే ప్రభుత్వ ప్రతినిధులే ఆ ఘటనలో గోదావరి జిల్లాలకు చెందినవాళ్లు ఎవరూ లేరని.. పులివెందుల వాళ్లే ఉన్నారని అప్పట్లో చెప్పారని గుర్తుచేశారు. అలాంటి మీరు ఈ రోజున అక్కడి యువకులను నిర్బంధించి, వాళ్లకు సంఘీభావం తెలిపిన వాళ్లను జైల్లో పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళన తామందరికీ ఉందని చెప్పారు.

ముద్రగడను పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతోనే తామంతా సమావేశమయ్యామని ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. ఒక జాతి పట్ల, ఒక నాయకుడి పట్ల చూపుతున్న వివక్ష బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక సామాజిక సమస్య అని.. అయితే దాన్ని ఒక ఉగ్రవాద సమస్యగా భావించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హేయమని అన్నారు. ఈ విషయాలను కవర్ చేస్తున్న మీడియాను కట్ చేసేస్తున్నారని, కాపు సోదర సోదరీమణులను అరెస్టుచేసి పోలీసుస్టేషన్లో పెట్టడం, అక్కడ కూడా జామర్లు పెట్టడం, ముద్రగడను చేర్పించిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో కూడా జామర్లు పెట్టి ఆయనతో ఎవరినీ మాట్లాడనివ్వకపోవడం.. ఎక్కడా ఇంతవరకు జరగలేదని దాసరి మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే అసలు మనం ఏపీలో ఉన్నామా, పాకిస్తాన్‌లో ఉన్నామా అనే వాతావరణం తూర్పుగోదావరిలో కనిపిస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని, ముద్రగడ కూడా చర్చలకు సిద్ధమన్నారు కాబట్టి.. ప్రభుత్వం త్వరగా స్పందించి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ఆయన వెనక తామున్నామని, జాతి వెనక తామంతా ఉన్నామని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటుచేశామన్నారు. ఈ ఉద్యమాన్ని సమర్థించే వాళ్లపై బురద చల్లించాలని కాపు మంత్రులతో ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని దాసరి నారాయణరావు అన్నారు. అలాంటి బురదజల్లే కార్యక్రమాలు మీరు మొదలుపెడితే, దానికి తమ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి జాగ్రత్త అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు తదితరులతో పాటు కాంగ్రెస్ నేతలు, పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.కాపు రిజర్వేషన్ల అంశంపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి ఏమైనా అయితే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ నాయకుడు, సినీనటుడు చిరంజీవి హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం జాప్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం, ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన కాపు ప్రముఖులు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత చిరంజీవి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలపై ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని, లేదంటే రెండు రోజుల తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ముద్రగడ కుటుంబసభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

గత పది రోజులుగా ఏపీలో చాలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని, ఇది చాలా అప్రజాస్వామికమని చిరంజీవి అన్నారు. ముద్రగడ పద్మనాభం దీక్ష ప్రారంభించిన రెండు గంటల్లోపే తలుపులు పగలగొట్టి, ఆయనను నిర్బంధించి అయోమయ పరిస్థితి కల్పించారని, ఆయన కోడలు, భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. దీన్ని తామంతా కలిసికట్టుగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. ఆయన అడగకూడనిది ఏమీ అడగలేదని, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినవి, ఎన్నికల కమిషన్‌కు సమర్పించినవే అడిగారని గుర్తు చేశారు. తుని ఘటనను తామెవరూ సమర్థించబోమని, అయితే ప్రభుత్వ ప్రతినిధులే ఆ ఘటనలో గోదావరి జిల్లాలకు చెందినవాళ్లు ఎవరూ లేరని.. పులివెందుల వాళ్లే ఉన్నారని అప్పట్లో చెప్పారని గుర్తుచేశారు. అలాంటి మీరు ఈ రోజున అక్కడి యువకులను నిర్బంధించి, వాళ్లకు సంఘీభావం తెలిపిన వాళ్లను జైల్లో పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళన తామందరికీ ఉందని చెప్పారు.

ముద్రగడను పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతోనే తామంతా సమావేశమయ్యామని ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. ఒక జాతి పట్ల, ఒక నాయకుడి పట్ల చూపుతున్న వివక్ష బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక సామాజిక సమస్య అని.. అయితే దాన్ని ఒక ఉగ్రవాద సమస్యగా భావించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హేయమని అన్నారు. ఈ విషయాలను కవర్ చేస్తున్న మీడియాను కట్ చేసేస్తున్నారని, కాపు సోదర సోదరీమణులను అరెస్టుచేసి పోలీసుస్టేషన్లో పెట్టడం, అక్కడ కూడా జామర్లు పెట్టడం, ముద్రగడను చేర్పించిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో కూడా జామర్లు పెట్టి ఆయనతో ఎవరినీ మాట్లాడనివ్వకపోవడం.. ఎక్కడా ఇంతవరకు జరగలేదని దాసరి మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే అసలు మనం ఏపీలో ఉన్నామా, పాకిస్తాన్‌లో ఉన్నామా అనే వాతావరణం తూర్పుగోదావరిలో కనిపిస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని, ముద్రగడ కూడా చర్చలకు సిద్ధమన్నారు కాబట్టి.. ప్రభుత్వం త్వరగా స్పందించి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ఆయన వెనక తామున్నామని, జాతి వెనక తామంతా ఉన్నామని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటుచేశామన్నారు. ఈ ఉద్యమాన్ని సమర్థించే వాళ్లపై బురద చల్లించాలని కాపు మంత్రులతో ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని దాసరి నారాయణరావు అన్నారు. అలాంటి బురదజల్లే కార్యక్రమాలు మీరు మొదలుపెడితే, దానికి తమ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి జాగ్రత్త అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు తదితరులతో పాటు కాంగ్రెస్ నేతలు, పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Leaders of the Kapu community, cutting across the party lines, have cautioned the State government that the latter will be held responsible if any harm is caused to the life of Kapunadu leader Mudragada Padmanabham who is continuing his fast from the hospital bed at Rajahmundry from June 9.

Speaking after coming out the three-hour-long meeting of the Kapu community leaders held here on Monday, former Union Minister Dasari Narayana Rao and K. Chiranjeevi alleged that the government was discriminating their community grossly and trying to bring rift by provoking some Ministers from the community against others who were supporting the agitation launched by Mr. Padmanabham.

“Kapu leaders are not allowed to venture out of their houses and are being arrested illegally even if they step out of houses. Nobody is being allowed to meet Mr. Padmanabham in the hospital and phone-jammers were being used there so that nobody could even talk to others. Such an oppressive situation is raising doubts among the community whether it’s India or Pakistan,” Mr. Narayana Rao said venting anger at the government.

He suggested the government to desist from provoking the community leaders in the government to resort to mudslinging on those supporting the agitation and said if the government continued with its attitude they (the community) had a lot of such ammunition to direct at the government. On the future course of the community, Mr. Narayana Rao said it would depend upon the government actions over the next two days.

Lashing out at the government for trying to portray the agitation of Mr. Padmanabham like that of ‘terrorist’ activity or a law and order issue, he said it was purely a social issue. “We have lost Vangaveeti Mohana Ranga in a similar agitation in the past and we are not ready to lose Mudragada Padmanabham now. Entire community is behind Mr. Padmanabham and his agitation is for the just rights of the community,” Mr. Narayana Rao said.

He sought to know from the government why it was hesitating to hold talks with Joint Action Committee (JAC) on the issue after expressed its readiness.

Mr. Chiranjeevi condemned the government for the police misbehaviour with the family members of Mr. Padmanabham while shifting him to the hospital after breaking the doors of his house on June 9. He was asking nothing new but what was promised in the election manifesto of TDP, Mr. Chiranjeevi pointed out.

https://www.youtube.com/watch?v=U2VQCAj5ZQA

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.