బిసి లకు ద్రోహం చేస్తుంది ఎవరు ?

Written by
Kapus appeal to MBc's

కాపులపైకి ఎగదోస్తూ… ఇటు బి.సి లకీ… అటు కాపులకీ ఇద్దరికీ ద్రోహం చేస్తున్నది ఎవరు ?

*ప్రియమైన నా కాపుజాతి సోదరులారా..!*
27.7.16 తేదీన బస్సు ప్రయాణం లో పరిచయం అయిన B.C లోని కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి సొదరుడు నాతో పంచుకున్న తన వ్యక్తిగత అభిప్రాయాలను, బాధను యథాతధంగా వ్రాసి post చేస్తున్నాను గమనించండి.
మనల్ని అభిమానించే ఇలాంటి నిజమైన B.C సొదరులను చైతన్యపరచండి!

*నిజమే! B.Cలకు అన్యాయం జరుగుతుంది*

👉� దాదాపు 139 B.C కులాల్లో,120కి పైగా కులాలు ఇప్పటికీ సంక్షేమానికి నోచుకోలేదు. దీనికి ప్రధానకారణం B.C ల పేరు తో వచ్చే ప్రయోజనాలన్నింటిని రాష్ట్రవ్యప్తంగా ప్రథానమైన 2,3 బి.సి కులాలు తెలివిగా దోచుకోవడమే! అన్ని విధాలా ఆ 2,3 కులాలే అభివృద్ధి చెందుతూ … మిగతా బి .సి లైన చాకలి, మంగళి , బెస్త, కమ్మరి, కుమ్మరి,కంసాలి , సాలి,తెనుకుల…. వంటి అనేక కులాలను రాజకీయంగా మాత్రం వాడుకుంటున్నారు.

👉� ఉదాహరణకు కోనసిమలో, గోదావరి జిల్లాల్లో బి.సి ల పేరుతో అన్ని విధాలా బాగుపడి,B.C ల యొక్క అన్ని ప్రయోజనాలను ఒక్కరై కొల్లగొడుతున్న కులం … శెట్టిబలిజ. కోనసిమ లోనే శెట్టిబలిజ ఉద్యోగులు వందలు,వేలల్లో �ఉన్నారు. ఆర్థికంగా,సామాజికంగా,వ్యాపారపరంగా,రాజకీయంగా ఎదిగి పోయి O.C ల కంటే మంచి స్థితిలో ఉన్నారు .మిగతా B.C లను ఎక్కడా ఎదగనీయకుండా, B.C లు అంటే శెట్టిబలిజలు మాత్రమే అన్నట్లు ప్రవర్తిస్తు,అన్నింటా ప్రయోజనాలను పొందుతూ ఇప్పుడు మిగతా బి.సి ల కోసం మొసలికన్నీరు కారుస్తున్నారు.

👉�అన్ని రంగాల్లో మిగతా B.Cలను ఏమాత్రం ఎదగనీయకుండా,అవకాశన్ని బట్టి అణగదోక్కతూ-ఇప్పుడు స్వార్ధం కోసం తమ రాజకీయ ప్రత్యర్థులైన కాపుల మీదకు ఎగదోయడానికి నిస్సిగ్గుగా బి.సి కార్డు వాడుకుంటున్నారు. మనపై కపటప్రేమను నటిస్తున్నారు.

👉�120 కి పైగా బి.సి కులాలు ఎంతో వెనుకబడి పోయి,కనీస గుర్తింపు కి నోచుకోకుండా ఉండటానికి మూలకారణం కోనసిమ లో శెట్టిబలిజ లాంటి కులాలు బి.సి ప్రయోజనాలన్నింటిని గంప గుత్తగా దోచేయడమే! బి.సి లకు నిజంగా ద్రోహం చేస్తున్నది బి.సి లను వాడుకుంటూ బాగా బలిసి పోయిన శెట్టిబలిజ లాంటి 2,3 కులాలే ! (గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ,ఉత్తరాంద్రలో మరొకరు కరు , మిగతా చోట వేరొ కరు) ఇప్పుడు రాజకీయ స్వార్ధం కోసం ఓర్వలేక,అసూయ ద్వేషాలతో కాపుల బడి ఏడుస్తూ , మిగతా బి.సి కులాలను కూడా కాపులపైకి ఎగదోయాలని చూస్తున్నారు .

👉�కాపులను ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం లేని కొందరు రాజకీయ స్వార్ధపరులు… వెనుకనుండి వెన్నుపోటు పొడవాలనే దురుధ్ధేశం తో మనలాంటి ఇతర బి.సి వర్గాలను దువ్వుతూ బి.సి పోరాటం అంటూ కుట్రలుచేస్తున్నారు,ఆ పోరాటం మనకొసం కాదు తస్మాత్ జాగ్రత్త ! బి.సి సోదరులారా, బి.సి ద్రోహుల ఉచ్ఛులో పడకండి. 120 పైగా బి.సి కులాలకు ఏ మాత్రం ప్రయోజనం లేని ,సరికదా భవిష్యత్తులో నష్టాలకు దారితీసే ఈ అగ్ర బి.సి ల మాయలో పడకండి.

👉�సాధారణ సమయాల్లో మనకు సామాజికంగా గాని , రాజకీయంగా గాని , ఆర్థికంగా గాని ఇప్పటివరకు మనకు లేశమాత్రం కూడా ఉపయోగపడని, సహకరించని ఆ అగ్ర బి.సి వర్గాల వారు తమ రాజకీయ ప్రయోజనాల కనుగుణంగా సందర్భన్ని బట్టి S.C, B.C, S.T ఐక్యత అంటూ ఒకసారి S.C, B.C ఐక్యత అంటూ ఒకసారి , B.C ,ల ఐక్యత అంటూ ఒకసారి ఇలా అవసరాన్ని బట్టి మాయ మాటలతో తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఆ”దొంగ ” నాయకుల నాటకాలను నమ్మకండి. బి.సి సహోదరులారా!!!

👉�స్వతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా, అప్పట్నించి రిజర్వేషన్లు ఉన్నా 120 కి పైగా B.C కులాలు సామాజికంగా వెనుకబడి ఉన్నాయి . దీనికి కారణం ఎవరు ?…. కాపులా,! కమ్మలా! రెడ్లా! రాజులా ! బ్రాహ్మణులా ! ఎవరో తెలుసుకో B.C సోదరా!…. సమాజంలోని ప్రత్యక్ష వాస్తవాన్ని గమనించి , పరిశీలించి తెలుసుకో సోదరా!.. ఇప్పటికీ తెలుసుకోకపోతే ఎప్పటికీ వెనుకబడి పోతాము! సోదరా! ఆ అగ్ర బి.సి ల తొత్తులుగా మిగిలి పోతాము సోదరా!..

👉�B.C కోటాలో రాజకీయ నాయకత్వం, M.L.A లు , కార్పోరేషన్లు, చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, చివరికి వార్డు మెంబర్లు కూడా మిగతా� బి.సి లకు దక్కకుండా – అన్ని రాజకీయ పదవులను, దర్జాగా అనుభవిస్తూ, సామాజిక, ఆర్థిక, వ్యాపార, విధ్య, ఉద్యోగ ప్రయోజనాలను దశాబ్దాలుగా దోచుకుంటూ… మిగతా బి.సి లకు ద్రోహం చేస్తున్నది.ఎవరు ?

👉�బి.సి కోటా లో రిజర్వేషన్ల ద్వారా విద్యా ఉద్యోగ అవకాశాలను పొందుతూ, open కేటగిరీ లో కూడా అపారంగా ఉద్యోగాలను పోందుతూ… మనలాంటి బి.సి లకు ఏమాత్రం అవకాశాలు ఇవ్వకుండా తమ తెలివి తేటలతో మెసం చేస్తూ, రాజకీయ ప్రయోజనాలన్నీంటినీ వారే పొందుతూ…. కాపులతో సఖ్యంగా, ఆత్మీయంగా ఉండే మనలాంటి ఇతర బి.సి లను… బి.సి ఐక్యత పేరుతో కాపులపైకి ఎగదోస్తూ… ఇటు బి.సి లకీ… అటు కాపులకీ ఇద్దరికీ ద్రోహం చేస్తున్నది ఎవరు ?

👉�అడక్కపోయినా రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4% B.C-E రిజర్వేషన్స్ ఇచ్చాడు. వెనుకబడిన ముస్లింలు వాటి వల్ల ఎంతో మేలు పొందుతున్నారు. బి.సి కోటా ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్న ముస్లిం ల వలన ఇప్పటి వరకు బి.సి లకు ఎలాంటి నష్టం జరగలేదు, భవిష్యత్తులో జరగదు కూడా ! అదే విధంగా కాపులకు ఇచ్చే రిజర్వేషన్లను విద్యా ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేస్తే {రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వకుండా} ఈ 120 కి పైగా బి.సి కులాలకు 0.1% కూడా నష్టం జరగదనే విషయం అటు అన్ని పార్టీలకూ ఇటు రాజకీయ నాయకులకూ, కుల నాయకులకు కూడా తెలుసు ! అయినా ఎందుకు ఈ ________అంటారా !…. బి.సి లకు నష్టంలేని న్యాయమైన రిజర్వేషన్లు కాపులకు ఇచ్చేస్తే… తమ నాటకాలకు,రాజకీయ కుతంత్రాలకు అవకాశం ఉండదని, ఇప్పటి వరకు తమ అడుగులకు మడుగులొత్తుతున్న మిగతా బి.సి లు కాపుల తో కలిసి పోతారని, దైర్యంగా దేనికైనా నీతిగా నిలబడే కాపుల సాయంతో మిగతా బి.సి లు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగిపోతారని, అలా జరిగితే ఇప్పటి వరకు బి.సి ల పేరుతో అన్నీ తామొక్కరే పొందుతున్న ప్రయెజనాల బండారం బయటపడి పోతుందని – అన్ని విధాలా ఎదిగిపోయిన 1,2 బి.సి కులాల్లోని కపట నాయకుల భయం . అందుకే కుట్రలు, కుతంత్రాలతో మీడియా సాయంతో, రాజకీయ స్వార్ధపరుల సాయంతో కాపులపై విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు.

👉�బి.సి కోటాలోని సర్పంచ్ సీటునో, కౌన్సిలర్ లేదా కనిసం వార్డుమెంబర్ సీటుో, మనకి కేటాయించమని,నెగ్గించమని ఆ అగ్ర బి.సి వారిని అడిగి చూడండి… వారి కపట ప్రేమ బండారం బయట పడిపోతుంది. బిసి ల ఐక్యత అంటూ చేసే డ్రామా ల సంగతి మనకి తేట తెల్లమౌతుంది. మనలాంటి వాస్తవంగా వెనుకబడిన బిసి లను ఎలా వాడుకుంటూ మో�సం చేస్తున్నారో అర్థమౌతుంది.

👉�చాకలి, మంగళి, కుమ్మరి, బెస్త, కమ్మరి లాంటి అనేక కులాల్లో ఉన్నటువంటి వెనుకబాటు తనం – ఉభయ గోదావరి జిల్లాల్లోని శెట్టిబలిజ ల్లో మచ్చుకైనా ఉందా? వారు సామాజికంగా రాజకీయంగా ఎంతో అభివృద్ధి చెంది, మిగతా బిసి లకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఉదాహరణకి అమలాపురం లోని ఓ ప్రముఖ వీధిలో 100 మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులైన శెట్టిబలిజలు ఉన్నారు. ఒక కిలోమీటర్ కూడా పరిధి లేని ఆ ఒక్క వీధి లోనే అంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఇక గోదావరి జిల్లా ల్లో, కోనసిమ లో ఎన్ని వేల మంది ఉన్నారోకదా !! రాష్ట్రంలో ఏ ఒక్క ఇతర బిసి కులాని కైనా ఇలాంటి స్థితి ఉందా? కాపుల వీధుల్లో గానీ, ఇతర బిసి వీధుల్లో గానీ పట్టుమని పది మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండరు కదా! జనాభా దామాషా ప్రకారం చూస్తే విధ్య ఉద్యోగల్లోనూ, ఆర్థికంగానూ శెట్టిబలిజలు ఎంతగా ఎదిగిపోయరో తెలిసి పోతుంది.

👉�ఇప్పటి వరకూ ఏ విధమైన సంక్షేమానికి నోచుకోకుండా అన్యాయనికి గురౌతున్న 120 కి పైగా బిసి కులాలు నిజంగా అభివృద్ధి చెందాలంటే, బిసి లలో అన్ని విధాలుగా అభివృధ్ధి చెంది, మిగతా బిసి లను రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటూ, అగ్రవర్ణలకు ధీటుగాఎదిగిపోయి, సాటి బిసి లను అణగద్రోక్కుతున్న అగ్ర బిసి కులాలను బిసి జాబితా నుండి తోలగించాలి, వారి రిజర్వేషన్లు రద్దుచేసి ఈ 120 కులాల వారికి వాటిని అందించాలి. అప్పుడే మన బిసి కులాలకు న్యాయం జరుగుతుంది. సోదరులారా,ఈ అసలు రహస్యాన్ని తెలుసుకోండి! బిసి లను తెలివిగా మోసం చేస్తూ కాపులపైకి ఉసిగోల్పుతున్న వారి కుట్రనుండి బయటపడి చైత�న్యవంతులవ్వండి.

👉�ప్రియమైన బిసి సోదరులారా, ఒక్కసారి సరియైన దృష్టితో గత 30,40 సంవత్సరాల పరిణామాలను పరిశీలించి… బిసి లకు ద్రోహం చేస్తున్న వారెవరో తెలుసుకోండి. దశాబ్దాలుగా అమాయకత్వంతో మోసపోతున్న బిసి కులాలను ప్రతి గ్రామం లోనూ, వార్డుల్లోనూ చైతన్య వంతులను చేయండి. మన చైతన్య మే మనకు భవిష్యత్తునిస్తుంది ఏ విధంగా అంటే ….

👉�వెనుకబడిన కాపులకు న్యాయమైన రిజర్వేషన్లు ఇవ్వక తప్పదు అనే విషయం అన్ని రాజకీయ పార్టీలకు అవగాహన అయింది. అందుకే TDP, BJP లోని అధికార వర్గాల వారితో పాటు కాంగ్రెస్, YSR కాంగ్రెస్ లు కూడా “కాపుల న్యాయమైన డిమాండ్ కు మద్దతు తెలుపుతున్నాయి. అందుకే కాపుల రిజర్వేషన్లు విధ్యా ఉద్యోగావ�కాశలకే పరిమితం చేసేలా, రిజర్వేషన్లు నిజంగా వెనుకబడిన కాపులకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి, కాపులకు మనం నైతిక మద్దతు తెలిపితే…. రాబోయే రోజుల్లో ….. కాపులను ఉపయోగించుకుని, మనకు దక్కవలసిన బిసి ప్రయెజనాలను సులభంగా పొందగలం అంతే కాకుండా బిసి కోటాలోని అన్ని రాజకీయ ప్రయోజనాలను, మనం మాత్రమే పొందే అధ్భుత అవకాశం కలుగుతుంది .

👉�స్వప్రయోజనాలకు మాత్రమే వాడుకునే అగ్ర బిసి లకు మద్దతిచ్చి…. ఎప్పటికీ వారి వెనకాలే బానిసల్లా బ్రతుకుదామా లేదా కాపులకు స్నేహితుల్లా సంఘీభావం తెలిపి, రాబోయే కాలంలో కాపుల మద్దతు తో రాజకీయంగా, సామాజికంగా ఎదుగుతూ బలపడదామా? అనే విషయన్ని తేల్చుకొవలసిన సంధి కాలం లో మనలాంటి బిసి లందరూ ఉన్నాము. సొదరులారా… రాజకీయ చైతన్యం తో, భవిష్యత్ ప్రయోజనాలను� దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. చిన్న చిన్న బిసి వర్గాలన్నింటినీ జాగృతం చెయ్యండి.

👉 *�కాపు సోదరులారా!*
పై విషయాలు అన్నీ మనతో పంచుకున్న శ్రీ కొటిపల్లి సత్యం గారికీ కృతజ్ఞతలు తెలియజెస్తూ….. అన్యాయం జరుగుతున్న 120 పైగా బి.సి కులాల సోదరులకు అండగా ఉందాము.. ఇప్ఫటికి సంక్షేమానికి నోచుకోని 120 పైగా B.C కులాల సోదరులకు ఏ మాత్రం నష్టం కలిగించకుండా ఇచ్చే రిజర్వెషన్లు మాత్రమే మనం కోరుకుందాము……సామాజిక రాజకీయ గుర్తింపు లేని ఈ 120 పైగా బి.సి కులాల సోదరులకు గుర్తింపు వచ్చేలా, మనతో పాటు వారూ ఎదిగేలా వారికి మన బలాన్ని తోడుగా అందిద్దాం..! బి.సి ద్రోహుల కుట్రలను చేదిద్దాం..! నిజమైన బి.సి ల కు “కాపు”కాద్దాం.! ఆత్మీయుల్లా రక్షకుల్లా నిలబడి వారి అభివృద్దికి తోడ్పాటునిద్దాం! అండగా ఉందాం! కమ్మరి,కుమ్మరి,చాకలి,మంగలి,బెస్త,సాలి, కంసాలి…మెదలుగు అనేక బి.సి కులాలకు సహృదయంతో ఉపయెగపడుతూ వారి ఆత్మీయతను చూరుగొందాం.చిరంజీవి గారు ప్రజా రాజ్యం పార్టీ పెట్టి 105 సీట్లు బీసీ సోదరులకు ఇచ్చారు . స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు బీసీ లకు కనీసం 100 సీట్లు ఇచ్చినా రాజకీయ పార్టీ ఉందా ? ! నీతి నీజయితీలకు పౌరుషంగా నిలబడే *”కాపుదనం”* అంటే ఏమిటో చూపిద్దాం..
By : అడపా ప్రకాష్

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.