Setty Balijas in Rayala Seema

Written by
Setty Balijas in Rayala Seema

Setty Balijas in Rayala Seema

Note: గోదావరి కృష్ణ గుంటూరు విశాఖ జిల్లాలలోని “ఈడిగ శెట్టి బలిజ” కులస్తులు కాపు, తెలగ, బలిజ కులానికి చెందరు

గోదావరి కృష్ణ గుంటూరు విశాఖ జిల్లాలలోని “ఈడిగ” కులస్తులను పూర్వకాలం నుండీ అక్కడ సామాజికంగా ఉన్నత స్థానంలో వున్న “బ్రాహ్మణ, రాజు, వైశ్య, బలిజ, తెలగ, కాపు, వంటరి, వెలమ, రెడ్డి, కమ్మ వంటి అగ్రకులాలు తర తరాలుగా తమ కొబ్బరి తోటలలో దింపు కార్మికులుగా వాడుకొనేవారు, వీళ్ళనే తెలంగాణలో “గమళ్ళు”, తమిళనాడులో “ఎజువ”, కర్ణాటకలో “బిల్లవ” వంటి పేర్లతో పిలుస్తారు …. “వీళ్ళు తాటి యీత చెట్ల పైన కల్లు తీసుకుని అమ్ముకునేవారు”….  అందువలన వీరిలో కొందరికి “శెట్టి” అని పేరుకూడా ఉంటుంది.  బ్రిటిష్ వారు మన దేశంలో వీళ్ళను కూలీలుగా బర్మా వంటి చోట్లకు తీసుకుపోవడం జరిగింది, వీరిలో కొందరు ఓడల మీద కార్మికులుగా పనిచేసి, ఆర్ధికంగా బలపడి బర్మాలో రాజకీయంగా కూడా బలపడినారు….  దానితో తమ స్వజాతీయులకు సమాజంలో ఉన్న తక్కువ తనమును పారదోలాలని, “యీడిగ” అనేది నింద అర్ధముగా ఉన్నదని భావించిన వీరు 1920 ప్రాంతంలో తూర్పు గోదావరి జిల్లా “అమలాపురం” ప్రాంతంలో తమ కులం పేరును, తాము చెట్ల పై ఆధార పడి జీవించేవారం కావున “చెట్టు” ను, కల్లును తీసి అమ్ముతాము కాబట్టి వ్యాపారం అర్ధంగా “బలిజ” అనేదానిని కలుపుకుని “చెట్టు బలిజ” అని పెట్టుకున్నారు, కాని దానినే “శెట్టి బలిజ” అని మార్చుకొని పిలుచుకుంటున్నారు

రాయల సీమ సెట్టిబలిజల బందువులైన గోదావరి కృష్ణ గుంటూరు విశాఖ జిల్లాలలోని బలిజ కాపు తెలగ కులాలతో, ఈ “యీదిగ శెట్టి బలిజ”లకు ఎటువంటి వైవాహిక సామాజిక సంబందం లేదు… ఈడిగ కులం బలిజకులం లో బాగం కాదు.. రాయల సీమ ప్రాంతం “శెట్టి బలిజ”లకు ఈ నవీన “ఈడిగ  శెట్టి బలిజ”లకు ఎటువంటి వైవాహిక సామాజిక సంబందం లేదు.   

రాయలసీమ శెట్టి బలిజలు : 

రాయలసీమ శెట్టి బలిజల ఘనమైన చరిత్ర కొన్ని వందల సంవత్సరాల నాటిది … కొన్ని వందల సంవత్సరాల పాటు అపార వైభవాలతో వర్ధిల్లిన బలిజ వంశాలలో భాగం … వకవైపు “రాచరికం” , మరోవైపు “వాణిజ్యం” ఈ రెండూ వున్న వర్గం …. అనంతపురం జిల్లాలోని “తిమ్మమ్మ మర్రిమాను” గురించి ఈనాడు ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు. 14 శతాబ్దం లో సతీ సహగమనం చేసుకున్న “తిమ్మమాంబ” రాయలసీమ “సెట్టిబలిజ”ల  ఆడపడుచు … ప్రఖ్యాత చెన్నక వంశీయురాలు …. ఈ చెన్నక వంశీయులు ప్రాచిన “చెండ్రక” రాజ వంశీయులు, చాళుక్యుల, గంగ రాజ వంశాల రాజ బందువులు ….. రాచరికాలు శాస్వతం కాదు కదా !! …. దాని మూలంగా ఈ కుటుంబాలు “రాచరికపు” వర్గాలకు ఆపద్ధర్మంగా వుండు “వాణిజ్యం” తమ వృత్తిగా స్వీకరించినారు …. దానితో వీరు రాచవారని బలిజవారని పిలువబడుచు వచ్చినారు … దేశ దేశాలూ తిరిగి అపారమైన వాణిజ్యం చేశారు …. తిమ్మమ్మ అత్తవారు “గంగరాజు” వారు… వీరు పెనుగొండ రాజ్యాన్ని హొయసల రాజప్రతినిదులుగా పరిపాలించినవారు … హొయసల రాజులు పతనమైన తరువాత పెనుగొండ రాజ్యాదిపత్యం పోగొట్టుకున్న ఈ గంగారాజు వంశం గూటిబయలు చేరింది.  గంగారాజుల ఈశ్వరనాయకుని కుమార్తె “దేవకీదేవి” మనమెంతో మన కుల ఔన్నత్యానికి గుర్తుగా నేటికి గౌరవిన్చుచున్న “శ్రీకృష్ణ దేవరాయల” ముత్తాత “సమ్మెట తిమ్మరాజు” గారి భార్య … ఈ సమ్మెట తిమ్మరాజు తరువాత విజయనగర బుక్కరాయల కొలువులో తులువనాడు జయించి పరిపాలించుట వలన వీరి కుటుంబాన్ని “తుళువ” వారు అని పిలవడం ప్రారంభమైనది …. ఈ తుళువ వారి బందు వర్గాలన్నీ రాచవారు బలిజవారు అంతే …..  ఈ తుళువ తిమ్మరాజు కుమారుడు ఈశ్వర నాయక భార్య పెనుగొండకు చెందిన “పగడాల” గౌరమ్మ…..  యీతని కుమారుడే నరసా నాయక ఈతను సాళువ వారి ఆడబడుచును, గాజులవారి ఆడబడుచును, తెలుగుచొళుల ఆడబడుచులను పరిణయ మాడెను … వీరి కుమారుడు వీర నరసింహ రాయల భార్య పట్టపు వారి ఆడబడచు, యీతని తోడి అల్లుడు పోలిశెట్టి రాయప్ప దళవాయి గారు, వీరు పెనుగొండ పగడాల వంశీయుల బందువులు …. కృష్ణదేవరాయల తల్లి గాజుల వారి ఆడబడచు …. వీరిలో పెనుగొండ, పగడాల, పట్టపు, కంచి, పోలిశెట్టి, ఆరవీటి, చొక్కపు, గాజుల, ఉక్కడంరాయలవారు, అన్నయగారు, సాళువ, కోలా, కోట, దేశాయి ఇలా వీరు నాటి ఈ రాచ బలిజ వర్గం …. ఈ తుళువ వంశీయులు నేటికి అదే ఇంటిపేరుతో కడప, అనంతపురం, కొండవీడు ప్రాంతాలలో ఉన్నారు …. యీ చెన్నక  వారికి రాజబందువులు బుక్కపట్నం పాలకులైన “పెదరాచ” వంశీయులు, గూటిబయలు  “ఎద్దుల”వారి వంశీయులు …. అందరూ రాచబలిజలె శెట్టిబలిజలె …. విజయనగరం వైభవంగా వర్దిల్లినప్పుడు హంపిలో “1000” బలిజ వంశాలు ఉండేవి …. 1565 తళ్ళికోట యుద్దంతో తలోదిక్కుకు పోయారు ….

మరీ గొప్ప చెప్పుకుంటున్నారని అనుకుంటారేమో గాని అవసరమోచ్చింది కాబట్టి చెబుతున్నా … మదుర, తంజావూరు, జింజి, కండి, బారామహలు, చంద్రగిరి, పెనుగొండ, రాయదుర్గం, హండె అనంతపురం, కేలడి, బేలూరు రాజ వంశాలు అన్ని బలిజలే…. దీనికి సంబందించిన స్పష్టమైన ఆధారాలు నేటికి భద్రంగానే ఉన్నాయి.

By: పోలిశెట్టి సత్తిరాయడు

Article Categories:
History

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.