Sri krishna Deva Rayalu History

Written by
Sri krishna Deva Rayalu History

Sri krishna Deva Rayalu History

బలిజ(కాపు) కులస్తులార…సూర్య,చంధ్ర వంశ క్షత్రియ బలిజ(కాపు)లు,శ్రీ క్రిష్ణ దేవరాయులు గురించి తెలుసుకోండి
—————————————————————————
చంద్ర వంశ క్షత్రియ బలిజ కులస్తుడైన శ్రీకృష్ణదేవరాయల వారు యాదవ కులానికి, గొల్ల కులానికి చెందిన వాడని చాలామంది చరిత్రకారులు తప్పుదారిలో, సరైన పౌరాణిక చారిత్రక సామాజిక అవగాహన లేకుండా వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వ్రాసినారు. వ్రాస్తున్నారు. తప్పు. అది చాలా పెద్ద తప్పు
చంద్ర వంశములో కృతయుగములో “యయాతి” మహారాజుకు “యదు”, “తుర్వసు”, “అను”, “ద్రుహ్యు”, “పురు” వంటి 5 గురు కొదుకులున్నారు. వీళ్ళందరూ కృతయుగములో రూపు దిద్దుకొని నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వేరువేరు వంశాలకు మూలపురుషులు. వీరిలో “యదువు”కు పుట్టినవారు మాత్రమే “యదు వంశం” వారము అని చెప్పుకుంటారు.
రాయలవారు, అనేక వంశాలుగా విడిపోయిన చంద్ర వంశములోని “తుర్వసు” వంశ పరంపర లోనివారు. అంతేగాని “యదు” వంశీయుడు కాదు. “శ్రీకృష్ణ” అనే పేరుతో గొప్ప చక్రవర్తిగానున్న తుర్వసు వంశీయుడగు శ్రీకృష్ణ దేవరాయలను సాక్షాత్తూ అదేపేరుతోనున్న, యదు వంశీయుడగు ద్వాపర యుగామునాటి శ్రీకృష్ణ భగవానునితో పోల్చుతూ, ఆతని ఆస్థాన కవులు, వైష్ణవ గురువులు,- శ్రీ కృష్ణునికి వున్న యదుకులతిలక, యాదవ నారాయణ అనే బిరుదులతో రాయలవారిని శ్రీ కృష్ణునిగా భావించి పిలిచినారు ….. అలావాడటం ఆనాడు సర్వ సాదారణం కూడా. యాదవాన్వాయుడు అంటే యదువు వంశమునకు చెందిన వాడని అర్ధము అనగా శ్రీ కృష్ణుడు. అంతేగాని తుర్వసు వంశీయుడగు శ్రీకృష్ణ దేవరాయలు యదు వంశీయుడు కాదు.
ఈ తుర్వసు వంశ పరంపరలోనివారు దక్షిణాదిన చోళ, పాండ్య, కుల్య, కోలా వంటి రాజ్యాలను స్థాపించినట్టు పురాణాలలో పేర్కొన్నారు. ఈ తుర్వసు వంశ పరంపరలోని “సంపెట” తిమ్మా నాయకుడు భార్య దేవకీదేవి పెనుకొండ గంగారాజుల ఆడబిడ్డ, వీరే తరువాత గూటిబయలు చేరినవారని, అక్కడ సతీ తిమ్మమాంబ గారు వీరి కుటుమ్బీకులని, వీరి బందువులే చెన్నకవారు, పెదరాచవారు, ఎద్దులవారు అనీ ఈ తిమ్మానాయక తుళువ ప్రాంతాన్ని జయించి పరిపాలించి నందువలన వీరిని “తుళువ” వారు అని అన్నారని వీరి పారంపర్య గురు వంశజులగు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ, జానమద్ది హనుమచ్చాస్త్రి వంటి వారి ద్వారా తెలిసిన విషయం ……. ….
13-14 శతాబ్దాల నాటి పెనుగొండలోని గంగారాజుల వంశీయులు, పెదరాచ వారు, చెన్నకవారు, పగడాలవారు, పట్టపువారు, పెనుగొండవారు, కంచివారు, పోలిసెట్టివారు వీళ్ళందరూ క్షత్రియులు. ఆపద్దర్మంగా వాణిజ్యం చేసేవారు కాబట్టి బలిజలుగా కూడా పిలువబడినారు. నాటి సమ్మెట వారను తుళువ వంశ సంబందులు …..
యీ తిమ్మా నాయకునికి యీశ్వర నాయక, తిమ్మానాయక అని కొడుకులు. వీరిలో యీశ్వరనాయకుని మొదటి భార్య చోళ వంశీయులగు పగడాలవారి ఆడపడుచు. రెండవ భార్య చంద్రగిరి సాళువ వారి ఆడపడుచు. యీతని కొడుకులు నరసానాయక, తిమ్మానాయక, ఈ నరసానాయక కొడుకులు వీర నరసింహ రాయలు, శ్రీ కృష్ణ దేవరాయలు, రంగారాయలు, అచ్యుత దేవరాయలు.. వీరి వంశ పరంపరలలోనివారు నేటికీ “తుళువ” వారిగానే ఉన్నారు.
వీరిలో వీర నరసింహరాయల తల్లి సాళువ వారి ఆడపడుచు. శ్రీ కృష్ణ దేవరాయలు తల్లి గాజుల వారి ఆడబడచు. రంగారాయలు, అచ్యుత దేవరాయల తల్లి చోళ వంశీయుల ఆడబడచు.
వీరిలో వీర నరసింహరాయల భార్య పట్టపువారి ఆడపడుచు. ఈ పట్టపు వారు, పోలిశెట్టి వారు నాటి పెనుగొండలోని పగడాలవారి బందువులు. చాళుక్య వంశీయులైన పోలిశెట్టి రాయప్ప దళవాయి తుళువ వీర నరసింహరాయల తోడి అల్లుడుగా ప్రసిద్దులు …..
ఈ శ్రీ కృష్ణ దేవరాయలు తల్లి, మరియు తండ్రి వైపు పూర్వ సంబందులే సాళువ, కటారి, కోలా, కోట, దేశాయి, సెలగోల, అన్నయగారు, మదుర, తంజావురు, తుండీర, కండీ రాజ వంశాల వారు …..
రంగారాయలు, ఈ రంగరాయల వంశీయులే ఉక్కడం రంగారాయల వారని పిలువబడువారు …..
అచ్యుత దేవరాయల తల్లి చోళ వంశీయుల ఆడబడచు. యీతని భార్య సలకం వారి ఆడబడచు. యీతని తోడి అల్లుడే తంజావూరి ఆలూరి చెవ్వ భూపతి గారు.
శ్రీ కృష్ణ దేవరాయల అల్లుడు ఆరవీటి అళియ రామరాయలు, తిరుమలరాయలు. వీరి బందువులే రాణా జగదేవరాయల వారు. వీరి బందువులే ఆరవీటివారు, నంద్యాల వారు, చొక్కపువారు, ఔకువారు, దువ్వూరివారు, ఏటూరివారు. ఈ ఆరవీటివారి బందువులే సవరంవారు, తుపాకులవారు, గొబ్బూరివారు, రాయదుర్గం రాజులగు వానరాశివారు. ఇలా ఎన్నో ఎన్నెన్నో వంశాలు విజయనగర రాజ వంశాలుగా, వారి బందువర్గాలుగా వున్నవి 1000 పైన క్షత్రియ బలిజలలో గలవని లెక్కించబడుచున్నవి.
వీరందరూ క్షత్రియులుగాను బలిజలుగాను పిలువబడుచున్న వర్గంవారిగానే సంబంద భాంధవ్యాలు కొనసాగిన్చుకొంటు వచ్చినారు……. బలిజలు అంటే శూద్రులు అని వ్రాసినారు. అర్ధం అదికాదు. వాణిజ్యం చేసేవారని అర్ధం. బలిజలుగా క్షత్రియ వంశాల వారూ వున్నారు. అలాగే రాచరికం శూద్రులూ ఉన్నారు ఇది ఎవరూ కాదనలేని నిర్వివాద అంశం ……
వీరెవరూ యాదవులు అని చెప్పుకొనుచున్న గొల్లలు కాదు …… బోయలూ కాదు …… కురుబలూ కాదు ……. కమ్మలూ కాదు ……
బలిజలుగా మారిన స్వచమైన సూర్య చంద్రవంశ క్షత్రియులు

BY: Suresh Ram

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.